[ఆలోకయే శ్రీ బాలకృష్ణం] ᐈ Alokaye Sri Balakrishnam Lyrics In Telugu Pdf

Alokaye Sri Balakrishnam Stotram Lyrics In Telugu

రాగం: హుసేని
తాళం: ఆది

ఆలోకయే శ్రీ బాల కృష్ణం
సఖి ఆనంద సుందర తాండవ కృష్ణం ॥ఆలోకయే॥

చరణ నిక్వణిత నూపుర కృష్ణం
కర సంగత కనక కంకణ కృష్ణం ॥ఆలోకయే॥

కింకిణీ జాల ఘణ ఘణిత కృష్ణం
లోక శంకిత తారావళి మౌక్తిక కృష్ణం ॥ఆలోకయే॥

సుందర నాసా మౌక్తిక శోభిత కృష్ణం
నంద నందనం అఖండ విభూతి కృష్ణం ॥ఆలోకయే॥

కంఠోప కంఠ శోభి కౌస్తుభ కృష్ణం
కలి కల్మష తిమిర భాస్కర కృష్ణం ॥ఆలోకయే॥

నవనీత ఖంఠ దధి చోర కృష్ణం
భక్త భవ పాశ బంధ మోచన కృష్ణం ॥ఆలోకయే॥

నీల మేఘ శ్యామ సుందర కృష్ణం
నిత్య నిర్మలానంద బోధ లక్షణ కృష్ణం ॥ఆలోకయే॥

వంశీ నాద వినోద సుందర కృష్ణం
పరమహంస కుల శంసిత చరిత కృష్ణం ॥ఆలోకయే॥

గోవత్స బృంద పాలక కృష్ణం
కృత గోపికా చాల ఖేలన కృష్ణం ॥ఆలోకయే॥

నంద సునందాది వందిత కృష్ణం
శ్రీ నారాయణ తీర్థ వరద కృష్ణం ॥ఆలోకయే॥

********

Leave a Comment